ధరల పెరుగుదలకు బ్రేక్!.. తగ్గిన గోల్డ్ రేట్లు | Today Gold And Silver Price 8th July 2024 | Sakshi
Sakshi News home page

Gold And Silver Price: ధరల పెరుగుదలకు బ్రేక్!.. తగ్గిన గోల్డ్ రేట్లు

Published Mon, Jul 8 2024 12:11 PM | Last Updated on Mon, Jul 8 2024 12:25 PM

Today Gold And Silver Price 8th July 2024

జులై ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. జులై నెలలో బంగారం ధరలు మొదటిసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 8) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67450 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గాయి. ఇదే ధరలు ముంబై, బెంగళూరు, వైజాగ్, ప్రొద్దుటూరులలో కూడా కొనసాగుతాయి.

చెన్నైలో కూడా పసిడి ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 68000 వద్ద, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 220 తగ్గి రూ. 74180 వద్ద నిలిచాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం కొంత తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

విజయవాడ, హైదరాబాద్, చెన్నై మాదిరిగానే దేశ రాజధాని నగరంలో కూడా గోల్డ్ రేట్లు తగ్గాయి. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 67600 వద్ద, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 73730 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు
బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా.. వెండి ధరలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ రోజు (జులై 8) కూడా వెండి ధరలు రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర నేడు రూ. 95వేలకు చేరింది. జులై ప్రారంభం నుంచి పెరుగుతూ ఉన్న ధరలు ఇలాగే కొనసాగితే.. వెండి ధర త్వరలోనే లక్షకు చేరుకునే అవకాశం ఉందనిపిస్తోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement