శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలు | Today Gold and Silver Price 2024 November 5th | Sakshi
Sakshi News home page

శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలు

Published Tue, Nov 5 2024 2:36 PM | Last Updated on Tue, Nov 5 2024 2:56 PM

Today Gold and Silver Price 2024 November 5th

బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 5) పసిడి రేటు గరిష్టంగా రూ.160 తగ్గింది. దీంతో గోల్డ్ ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. కాబట్టి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేటు ఎలా ఉందనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

ఆంధ్రప్రదేశ్ (విజయవాడ), తెలంగాణ (హైదరాబాద్) వంటి తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,240.. 22 క్యారెట్ల ధర రూ.73,550 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.

ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు రూ. 150 (10 గ్రా 24 క్యారెట్స్) & రూ. 160 (10 గ్రా 22 క్యారెట్స్) తగ్గింది. ధరలు ఎంత తగ్గినప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధానిలో బంగారు ధరలు ఈ రోజు రూ. 80,390, రూ. 73,700 వద్ద నిలిచాయి.

చెన్నైలో కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,240 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,550 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గింది.

వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా రూ.1,000 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ. 1,05,000 వద్ద నిలిచింది. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా బంగారం, వెండి ధరలు ఏ మాత్రం పెరగలేదు.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement