బంగారం కొనేవారికి సెప్టెంబర్ కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో ఇప్పటి వరకు పసిడి ధరలు ఒకసారి మాత్రమే పెరిగాయి. కాగా ఈ రోజు (ఆదివారం) కూడా ధరల పెరుగుదల జరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఆదివారం బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 66800 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.72870 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటులో ఈ రోజు ఎలాంటి కదలికలు లేదని తెలుస్తోంది.
చెన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు ఈ రోజు స్థిరంగా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నిన్న రూ. 2500 తగ్గిన వెండి.. ఈ రోజు నిశ్చలంగా ఉంది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 89500 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.
ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment