ఆగష్టు 9 నుంచి పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1040 పెరిగింది. దీంతో బంగారం ధరలు మళ్ళీ యధాస్థానానికి చేరుతున్నాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 12) గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65650 కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 71620 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 950, రూ. 1040 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 950, రూ. 1040 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65650 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 71620 వద్దకు చేరాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 65800 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71770 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలకంటే కూడా ఈ రోజు ధరలు వరుసగా రూ. 950, రూ. 1040 పెరిగిందని స్పష్టమవుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని అవగతమవుతోంది.
వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా ఈరోజు రూ. 1000 పెరిగింది. సోమవారం రూ. 600 తగ్గిన వెండి ధర మంగళవారం రూ. 1000 పెరిగి రూ. 83500 (కేజీ)కు చేరింది. మారుతున్న పరిణామాలు చూస్తుంటే.. బంగారం వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమైపోతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment