శ్రావణమాసం వచ్చేసింది.. బంగారం ధరలు భారీగా పెరుగుతాయి అనుకున్న సమయంలో, ఊహకందని రీతిలో గోల్డ్ రేటు తగ్గింపోయింది. ఈ రోజు పసిడి ధర గరిష్టంగా రూ. 870 తగ్గింది. దీంతో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 6) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63900 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 69710 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.800, రూ. 870 తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.
చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64000 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 69820 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 760 తగ్గింది.
దేశ రాజధాని నగరంలో బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64050 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69860 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 800, రూ. 870 తగ్గింది.
వెండి ధరలు
బంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. సోమవారం రూ. 200 పెరిగిన వెండి ధర మంగళవారం (ఆగష్టు 6) రూ. ఏకంగా రూ. 3200 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 82500లకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment