దేశంలో బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. మంగళవారం (జులై 30) పసిడి ధరలు గరిష్టంగా రూ. 330 తగ్గింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63200 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 68950 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ. 210 తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.
చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63850 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 69650 వద్ద ఉన్నాయి. నిన్న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. చెన్నైలో మాత్రం ధరలు తగ్గాయి.
దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63350 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69100 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 210 తగ్గింది.
వెండి ధరలు
బంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. సోమవారం రూ. 500 పెరిగిన వెండి ధర మంగళవారం (జులై 30) రూ. 500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 84500లకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment