ఆగష్టు 17న భారీగా పెరిగిన బంగారం ధరలు రెండు రోజులు స్థిరంగా ఉండి, ఈ రోజు (మంగళవారం) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో పసిడి ధరలలో కొంత మార్పు సంభవించింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 120 (24 క్యారెట్స్ 10 గ్రా) తగ్గింది. దీంతో ఈ ప్రాంతాల్లో తులం బంగారం ధర రూ. 66600 & రూ. 72650 వద్ద ఉన్నాయి.
ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66600, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72650గా ఉంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం రెండు రోజుల తరువాత కొంత తగ్గుముఖం పట్టింది.
దేశ రాజధానిలో కూడా 10 గ్రా 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ గోల్డ్ రేట్లు వరుసగా రూ. 100, రూ. 120 తగ్గింది. దీంతో పసిడి ధరలు రూ. 66750 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 72800 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం రేటు.. ఈ రోజు మాత్రం స్వల్పంగా మాత్రమే తగ్గింది.
వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. వెండి మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తోంది. దీంతో సిల్వర్ రేటు మళ్ళీ గరిష్టాలకు చేరింది. ఈ రోజు (ఆగష్టు 20) కేజీ వెండి రేటు రూ. 1000 పెరిగి రూ. 87000 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment