తగ్గిన బంగారం, వెండి ధరలు: ఎంతంటే? | Today Gold and Silver Price 7th Sep 2024 | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు శుభవార్త: మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Published Sat, Sep 7 2024 12:03 PM | Last Updated on Sat, Sep 7 2024 12:04 PM

Today Gold and Silver Price 7th Sep 2024

సెప్టెంబర్ నెలలో మొదటిసారి పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తులం బంగారం రేటు రూ. 440 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.72870 వద్ద నిలిచింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో శనివారం బంగారం ధరలు  మళ్ళీ తగ్గాయి. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 400 తగ్గి రూ. 66800 వద్దకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 440 తగ్గి రూ.72870 వద్ద నిలిచింది.

చెన్నైలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న కొంత పెరిగిన పసిడి ధరలు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నయని స్పష్టంగా తెలుస్తోంది.

వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధర రూ. 2500 తగ్గింది. నిన్న రూ. 2000 పెరిగిన కేజీ వెండి ధర ఈ రోజు రూ. 2500 తగ్గింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 84500 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.

ఇదీ చదవండి: అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement