బంగారం ప్రియులకు శుభవార్త. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈ వారంలో వరుసగా తగ్గుముఖం పడుతుండడం కొనుగోలు దారులకు కలిసొచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో ధరలు స్థిరంగా ఉన్నాయని, పసిడి కొనుగోలుకు ఇదే మంచి తరుణమని అంటున్నారు. ఇక తాజాగా, ఆదివారం (మే 26) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,590 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరింది
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,600 కు చేరింది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment