బంగారం, వెండి ధరల రికార్డులు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో కేజీ వెండి ధర మంగళవారం రూ.1,500 పెరిగి రూ.1,01,000కు చేరింది. వెండి రూ.లక్ష దాటడం ఇదే తొలిసారి. గత ఐదు రోజులుగా వెండి లాభాల బాటన పయనిస్తోంది.
బంగారం 99.9 పూర్తి స్వచ్ఛత ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.350 పెరిగి రూ.81,000కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.80,600కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లలో బంగారం, వెండి పటిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీనత విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ పెరగటమే వెండి ధర పరుగుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల భారీగా పడుతున్నాయి. దాంతో మదుపర్లు కొంత సేఫ్‌గా ఉండే బంగారంపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment