
దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ఫ్యూచర్స్ ధరలు వెనకడుగు వేస్తున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం..
నేలచూపులో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 510 క్షీణించి రూ. 50,060 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 676 నష్టపోయి రూ. 60,469 వద్ద కదులుతోంది.
లాభపడ్డాయ్
బంగారం, వెండి ధరలు గురువారం లాభపడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 236 పుంజుకుని రూ. 50,570 వద్ద ముగిసింది. తొలుత 50,645 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,120 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 1,226 జంప్‌చేసి రూ. 61,145 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 61,530 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 59,620 వరకూ నీరసించింది.
బలహీనంగా
న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వెనకడుగులో ఉన్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం క్షీణించి 1,898 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం తగ్గి 1,893 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 0.45 శాతం నీరసించి 23.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment