
ఆల్‌టైం హై దిశగా పసిడి..
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లో సోమవారం వరుసగా మూడో రోజూ పసిడి ధరలు భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 226 రూపాయలు పెరిగి 52,393 రూపాయలకు ఎగబాకింది. ఇక కిలో వెండి 755 రూపాయలు భారమై 66,090 రూపాయలకు ఎగిసింది. ఇక గత ఐదు రోజులగా పదిగ్రాముల బంగారం 1500 రూపాయలు పెరగ్గా, వారం రోజుల్లో వెండి కిలోకు 4000 రూపాయలు భారమైంది.
అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్ సారథ్యంలో భారీ ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించవచ్చనే సంకేతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడంతో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ నెలకొందని ఏంజెల్ బ్రోకింగ్ కమాడిటీస్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లో పండుగ సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బులియన్ నిపుణులు చెబుతున్నారు. చదవండి : పెట్టుబడులకు ‘బంగారం’!