
పెరిగిన బంగారం, వెండి ధరలు
ముంబై : తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు మళ్లీ భారమవుతున్నాయి. బంగారం, వెండి ధరలు సోమవారం వరుసగా మూడోరోజూ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగా ఉన్నా డాలర్ బలపడటంతో దేశీ మార్కెట్‌లో పసిడి ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 261 రూపాయలు పెరిగి 51,078 రూపాయల వద్ద ట్రేడవుతుండగా, కిలో వెండి ఏకంగా 1103 రూపాయలు పెరిగి 63,987 రూపాయలు పలికింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. డాలర్ బలోపేతం, ఉద్దీపన ప్యాకేజ్‌పై స్పష్టత కొరవడటంతో బంగారం ధరలు ఒత్తిళ్లకు లోనయ్యాయి. మూడువారాల గరిష్టస్ధాయి నుంచి బంగారం ధరలు కొంతమేర దిగివచ్చాయి. ఔన్స్ బంగారం స్వల్పంగా తగ్గి 1925 డాలర్లకు దిగివచ్చింది. డాలర్ పుంజుకోవడంతో ఇతర కరెన్సీల నుంచి బంగారం కొనుగోళ్లు ఖరీదుగా మారాయి. చదవండి : బంగారం మళ్లీ భారం!