
ముంబై : గత మూడు రోజుల్లో బంగారం ధరలు గురువారం రెండోసారి తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఉద్దీపన ప్యాకేజ్ వెలువడే సంకేతాలు లేకపోవడంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్టలో పసిడి ధర పతనం కావడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 111 రూపాయలు దిగివచ్చి 50,431 రూపాయలు పలకగా, వెండి కిలో 543 రూపాయలు తగ్గి 61,061 రూపాయలుగా నమోదైంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1893 డాలర్లకు దిగివచ్చింది. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ కొరవడటం, డాలర్ బలోపేతంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొన్నా కరోనా వైరస్ కేసులు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసుల కమాడిటీ రీసెఉర్చి హెడ్ హరీష్ పేర్కొన్నారు. చదవండి : గుడ్‌న్యూస్ : పసిడి ధరల పతనం