
ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పతనమవడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు దిగివచ్చాయి. గత నెలలో బంగారం ధరలు రికార్డుస్ధాయిలో 56,200 రూపాయల ఆల్‌టైం హైకి చేరిన తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనై 5000 రూపాయల వరకూ తగ్గుముఖం పట్టాయి. ఇక ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం 285 రూపాయలు తగ్గి 51,489 రూపాయలకు తగ్గింది. కిలో వెండి ఏకంగా 1019 రూపాయలు పతనమై 67,972 రూపాయలకు దిగివచ్చింది.
ఇక డాలర్ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ తగ్గింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1947 డాలర్లకు తగ్గింది. ఇక ఈక్విటీ మార్కెట్లు, అమెరికన్ డాలర్ కదలికలకు అనుగుణంగా బంగారం ధరల తదుపరి దిశ ఆధారపడి ఉంటుందని కొటాక్ సెక్యూరిటీస్ పేర్కొంది. బంగారం ధరల్లో మరికొంత కాలం అనిశ్చితి కొనసాగుతుందని అంచనా వేసింది. బంగారం ధరలు మరింతగా పడిపోతే పసిడి కొనుగోళ్లు ఊపందుకోవచ్చని తెలిపింది. చదవండి : బంగారం : రూ. 50 వేల దిగువకు వస్తేనే!