
ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం పసిడి ధరలు భారమయ్యాయి. గత వారం తీవ్ర ఒడిదుడుకులతో సాగిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో మళ్లీ పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 174 రూపాయలు భారమై 50,852 రూపాయలకు పెరిగింది.
ఇక 703 రూపాయలు పెరిగిన కిలో వెండి 67,969 రూపాయలకు చేరింది. కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, నిరుద్యోగ రేటు ఇంకా అత్యధికంగానే ఉండటంతో బంగారం ధరలు ఈ వారం కూడా ఒడిదుడుకుల మధ్యే సాగుతాయని పృధ్వి ఫిన్‌మార్ట్ కమాడిటీ, కరెన్సీ రీసెర్చి హెడ్ మనోజ్ జైన్ అంచనా వేశారు.