
ముంబై : గత నెలలో కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి మంగళవారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి 188 రూపాయలు తగ్గి 50,877 రూపాయలు పలికింది.
కిలో వెండి 730 రూపాయలు తగ్గి 67,541 రూపాయలుగా నమోదైంది. ఇక డాలర్ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. స్పాట్‌గోల్డ్ ఔన్స్‌కు 1925 డాలర్లకు తగ్గింది. ఇక బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతాయని ధరలు తగ్గిన సందర్భాల్లో కొనుగోలు చేయడం మేలని బులియన్ నిపుణులు సూచిస్తున్నారు. చదవండి : ఊరట : దిగివస్తున్న బంగారం ధరలు