మళ్లీ ఎగిసిన పసిడి | Gold prices Rose In The National Capital | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎగిసిన పసిడి

Oct 19 2020 5:48 PM | Updated on Oct 19 2020 6:09 PM

Gold prices Rose In The National Capital - Sakshi

ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం ధరలు భారమయ్యాయి. కరోనా వైరస్‌ కేసుల పెరుగుదలతో పాటు అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్‌పై అస్పష్టతతో పసిడికి డిమాండ్‌ పెరిగింది. ఇక ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 213 రూపాయలు పెరిగి 50,760 రూపాయలకు చేరగా, కిలో వెండి ఏకంగా 1075 రూపాయలు భారమై 62,751 రూపాయలు పలికింది. మరోవైపు దేశ రాజధానిలో పదిగ్రాముల పసిడి 182 రూపాయలు పెరిగి 51,740 రూపాయలకు చేరింది. కిలో వెండి 805 రూపాయలు భారమై 63,714 రూపాయలకు ఎగబాకిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 1909 డాలర్లకు పెరిగాయి. చదవండి : భారీగా కుంగిన బంగారం దిగుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement