
ముంబై : గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులతో దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు దిగివచ్చాయి.గత మూడు రోజుల్లో రెండోసారి పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో పండగ సీజన్‌లో ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉంది. బుధవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 133 రూపాయలు తగ్గి 50,368 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి కిలో 746 రూపాయలు తగ్గుముఖం పట్టి 62,298 రూపాయలకు పడిపోయింది. చదవండి : 3 రోజుల లాభాలకు బ్రేక్- పసిడి డీలా
మరోవైపు ఆగస్ట్‌లో బంగారం ధరలు 56,200 రూపాయల ఆల్‌టైం హైకి చేరిన క్రమంలో ప్రస్తుతం పసిడి ధరలు రికార్డు ధరల నుంచి 6000 రూపాయల వరకూ తగ్గాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌పై సానుకూల ప్రకటనలతో బంగారం ధరలు మరికొంత తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ భాగస్వామి బయోన్‌టెక్‌తో కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్ మూడవ దశ ఫలితాల్లో పురోగతి సాధించామన్న ప్రకటనతో పసిడి నేల చూపులు చూస్తోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి.