
ముంబై : బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1957 డాలర్లకు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల పసిడి 65 రూపాయలు తగ్గి 51,437 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 1299 రూపాయలు దిగివచ్చి 67,050 రూపాయలకు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటంతో పాటు అమెరికా ఉత్పాదక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో మదుపరులు కరెన్సీ, ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతాయని కమాడిటీస్ విశ్లేషకులు జిగర్ త్రివేది పేర్కొన్నారు. ఇక ఆగస్ట్‌లో బంగారం ధరలు 56,000 రూపాయల రికార్డు స్ధాయికి చేరిన అనంతరం 5,000 రూపాయల వరకూ దిగివచ్చాయి. చదవండి : పసిడి ధరల పతనానికి బ్రేక్!