అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న అంచనాలతో ఈ వారం మొదట్లో జోరు చూపిన పసిడి, వెండి ధరలు బుధవారం డీలా పడిన విషయం విదితమే. బుధవారం డాలరు ఇండెక్స్ బలపడగా.. 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో బులియన్ ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుత ట్రేడింగ్ వివరాలు ఇలా..
లాభాలతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 375 పుంజుకుని రూ. 51,195 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,247 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,161 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 554 లాభపడి రూ. 61,943 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 62,165 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,931 వరకూ క్షీణించింది.
కామెక్స్‌లో..
న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం ఎగసి 1,906 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం పుంజుకుని 1,907 డాలర్లకు చేరింది. వెండి 1 శాతం బలపడి ఔన్స్ 24.12 డాలర్ల వద్ద కదులుతోంది.
లాభపడ్డాయ్
పసిడి, వెండి ధరల మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 788 క్షీణించి రూ. 50,810 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,465 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,773 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,365 పతనమై రూ. 61,320 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,335 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 60,800 వరకూ వెనకడుగు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment