
ముంబై : బంగారం ధరలు గురువారం వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధరల పతనంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి దిగివచ్చింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 165 రూపాయలు తగ్గి 50,330 రూపాయలకు పడిపోయాయి.
కిలో వెండి 300 రూపాయలు పతనమై 59,899 రూపాయలు పలికాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. ఔన్స్ బంగారం 1877 డాలర్లకు పతనమైంది. అమెరికన్ డాలర్ బలోపేతం కావడంతో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ తగ్గుముఖం పట్టిందని బులియన్ నిపుణులు పేర్కొన్నారు.