
ముంబై : బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఈనెలలో గరిష్టంగా 56,000 రూపాయలకు చేరిన పదిగ్రాముల పసిడి ప్రస్తుతం 50,000 రూపాయల స్ధాయికి పడిపోయింది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు బుధవారం సైతం పతనాల బాటపట్టాయి. స్టాక్‌మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం వన్నె తగ్గింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 249 రూపాయలు తగ్గి 50,675 రూపాయలకు దిగిరాగా, కిలో వెండి 249 రూపాయలు దిగివచ్చి 63,500 రూపాయలుగా నమోదైంది. చదవండి : రూ . 5000 దిగివచ్చిన బంగారం
కోవిడ్-19కు మెరుగైన చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశలతో పాటు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం దిశగా సానుకూల సంకేతాలతో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ బంగారం 1927 డాలర్ల వద్ద నిలకడగా ఉంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు బంగారం తదుపరి దిశను నిర్ణయిస్తాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment