
ముంబై : కోవిడ్-19 వ్యాక్సిన్‌పై సానుకూల ప్రకటనతో సోమవారం భారీగా తగ్గిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ భగ్గుమన్నాయి. అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటిస్తుందనే అంచనాలతో పసిడి ధరలు పరుగులు పెట్టాయి. మరోవైపు కరోనా వైరస్ కేసులు పెరగడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల చుట్టూ న్యాయ వివాదాలు ముసురుకోవడంతో బంగారంలో పెట్టుబడులకు మదుపరులు మొగ్గుచూపారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 640 రూపాయలు పెరిగి 50,388 రూపాయలు పలకగా, కిలో వెండి ఏకంగా 1273 రూపాయలు భారమై 62,127 రూపాయలకు ఎగిసింది. మరోవైపు ఆల్‌టైం హై నుంచి బంగారం ధరలు ఇటీవల కొద్దిగా దిగిరావడంతో దివాళి, ధంతేరస్‌ల సందర్భంగా డిమాండ్ పెరగవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : పెట్టుబడులకు ‘బంగారం’!