
ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. పసిడి ధరల అనిశ్చితి నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు వరుసగా మూడోరోజూ దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 125 రూపాయలు తగ్గి 50,617 రూపాయలకు తగ్గింది. దేశీ మార్కెట్‌లో పసిడి ధరలు దిగిరాగా, వెండి ధరలు పైకి ఎగబాకాయి. కిలో వెండి 174 రూపాల లాభంతో 67,100 రూపాయలు పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1935 డాలర్లు పలకగా, వెండి ధరలు ఔన్స్‌కు 26.71 డాలర్లతో ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు వెలువడనుండటంతో జాబ్ డేటా తదుపరి పసిడి ధరల దిశను నిర్ధేశిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.