
ముందురోజు ఒక్కసారిగా జోరందుకున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలహీనపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. బుధవారం దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి దూకుడు చూపాయి. కాగా.. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 49 తగ్గి రూ. 51,730 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 177 క్షీణించి రూ. 67352 వద్ద కదులుతోంది. ఈ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. రెండు వారాలుగా పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే.
బుధవారమిలా
ఎంసీఎక్స్‌లో'బుధవారం 10 గ్రాముల పసిడి రూ. 855 జంప్‌చేసి రూ. 51,779 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,876 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,551 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 3,522 దూసుకెళ్లి రూ. 67,529 వద్ద నిలిచింది. ఒక దశలో 67,815 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 63,153 వరకూ పతనమైంది.
కామెక్స్‌లో..
న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం 1,952 డాలర్లకు జంప్‌చేసిన ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం స్వల్ప నష్టంతో 1,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1954 డాలర్లకు పెరిగిన బంగారం తాజాగా 1942 డాలర్ల వద్ద కదులుతోంది. ఇది 0.65 శాతం నష్టంకాగా.. ఇక ముందురోజు 27.5 డాలర్లకు ఎగసిన వెండి సైతం నామమాత్ర నష్టంతో ఔన్స్ 27.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment