వేల కోట్ల నాజీ సొత్తును వెలికితీస్తారా? | British treasure hunters find chest that could contain Nazi gold worth £100m in sunken cargo ship | Sakshi
Sakshi News home page

వేల కోట్ల నాజీ సొత్తును వెలికితీస్తారా?

Published Mon, Jul 24 2017 10:33 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

వేల కోట్ల నాజీ సొత్తును వెలికితీస్తారా?

వేల కోట్ల నాజీ సొత్తును వెలికితీస్తారా?

ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన నాజీల ఓడను వెలికితీయాలని ట్రెజర్‌ హంటర్లు భావిస్తున్నారు. ఇందుకోసం ఐలాండ్‌ ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ అమెరికా నుంచి జర్మనీకి తరలిస్తున్న టన్నుల కొద్దీ బంగారం మునిగిపోయిన ఓడలో ఉందని ట్రెజర్‌ హంటర్ల నమ్మకం.

1939 రెండో ప్రపంచ యుద్ధం జరగుతున్న నేపథ్యంలో దక్షిణ అమెరికా నుంచి జర్మనీకి బయల్దేరిన ఈ ఓడను ఇంగ్లండ్‌ తన సముద్రజలాల్లో అడ్డుకుని దాడి చేసింది. దాంతో ఓడతో పాటు దక్షిణ అమెరికా నుంచి వస్తున్న విలువైన వస్తువులు సముద్ర అంతర్భాగంలో కలసిపోయాయి.

దాదాపు నాలుగు టన్నుల బంగారం మునిగిపోయిన ఓడలో దాడి ఉందని పలువురి అభిప్రాయం. బంగారం విలువ దాదాపు 100 మిలియన్ పౌండ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓడలో ఉన్న బాక్సును వెలికితీసేందుకు బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఐలాండ్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించి పరిశోధనలు చేయాలని భావించినా ఆ దేశ ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో నేవీ ఒప్పుకోలేదు. దీంతో ఐలాండ్‌ ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం బ్రిటన్‌ కంపెనీ వేచి చూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement