Nazi
-
వర్రీ ఎందుకు సార్! ప్రస్తుతం మనం చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి!
వర్రీ ఎందుకు సార్! ప్రస్తుతం మనం చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి! -
కెనడా ప్రధాని క్షమాపణలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్లో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని ప్రశంసించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు తెలిపారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా సభలో సభ్యులు ప్రశంసలు కురిపించారని వెల్లడించిన ట్రూడో.. నాజీల దురాఘాతంలో నష్టపోయినవారికి ఇబ్బందికరమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కెనడాలో పర్యటించారు.ఈ క్రమంలో హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న యారోస్లావ్ హుంకా(98)ను స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. సభలో సభ్యులందరూ హుంకాకు చప్పట్లతో ఆహ్వానం పలికి ప్రశంసించారు. స్పీకర్ రోటా.. హుంకాను హీరోగా అభివర్ణించారు. ఇది కాస్త వివాదంగా మారింది. ఎందుకు వివాదం..? యారోస్లావ్ హుంకా రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో పనిచేసిన నాజీల ప్రత్యేక సైన్యంలో పోరాడారు. ఈ యుద్ధంలో యూదులను అంతం చేయడానికి హిట్లర్ భయంకరమైన హింసకు పాల్పడ్డాడు. అయితే.. ఈ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నాజీల ఆధీనంలో ఉండేది. స్వయంగా జెలెన్స్కీ కూడా తన యూదు బంధువులను ఎందరినో కోల్పోయారు. ఇలాంటి రాక్షస క్రీడ జరిపిన యుద్ధ పక్షాన నిలపడిన హుంకాను కామన్స్ సభలో సత్కరించడం వివాదంగా మారింది. యారోస్లావ్ హుంకా ఒకప్పుడు ఉక్రెయిన్ దేశస్థుడు. కెనడాకు వలస వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. క్షమాపణలు కోరినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడితో హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంథోనీ రోటా కూడా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అటు.. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ దేశ అధ్యక్షుని పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానంగా పేర్కొన్నారు. అయితే.. స్పీకర్ రోటా హుంకాను ఆహ్వానించే అంశాన్ని ప్రభుత్వంతో పంచుకోరని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదంపై రష్యా కూడా స్పందించింది. యుద్ధంలో ప్రేరేపించి ఉక్రెయిన్ను అంతం చేసే దిశగా పశ్చిమ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కెనడాలో జరిగిన ఈ సంఘటన ఇందుకు ఉదాహారణగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం -
11 ఏట విడిపోయి.. 89 ఏట కలిశారు!
లాస్ఏంజిలెస్ : పాలకుల క్రూరత్వానికి ఎందరో బలిపశువులుగా మారారు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ముఖ్యంగా నాజీల కాలంలో చోటుచేసుకున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ఉన్నవారిని, పెరిగిన ఊరును, దేశాన్నే వదిలి ఎంతోమంది వెళ్లిపోయారు. అలాంటివారిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు దాదాపు 76 ఏళ్ల తర్వాత కలిశారు. ఆ వివరాల్లోకెళ్తే.. 1940వ సంవత్సరం.. నాజీలు బెల్జియంను ముట్టడించారు. అప్పటికే ప్రాణ స్నేహితులైన సైమన్, గస్టిల్ వెయిట్స్ కూడా విడిపోయారు. సైమన్ కుటుంబం నాజీల చేతిలో బలైపోయింది. దీంతో వెయిట్స్ తండ్రి తనకున్న సంపదనంతా నగదుగా మార్చి, క్యూబా వెళ్లే షిప్ ఎక్కారు. బ్రసెల్స్ వెళ్లి తలదాచుకోవచ్చని భావించారు. అయితే ఇన్నేళ్ల తర్వాత సైమన్ కుటుంబంలో మిగతావారంతా చనిపోయినా.. సైమన్ మాత్రం బతికే ఉన్నాడని వెయిట్స్‌కు తెలిసింది. దీంతో లాస్ ఏంజిలెస్‌లో స్థిరపడిన వెయిట్స్.. సైమన్స్ ఆచూకీ కోసం ఎంతగానో ప్రయత్నించి, చివరికి జాడ తెలుసుకుంది. లాస్ ఏంజిలెస్ మ్యూజియం సాక్షిగా ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. 11 ఏళ్లునప్పుడు విడిపోయిన వీరిద్దరు దాదాపు 89 ఏళ్ల వయసులో కలుసుకొని, కన్నీళ్లతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. -
వేల కోట్ల నాజీ సొత్తును వెలికితీస్తారా?
ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన నాజీల ఓడను వెలికితీయాలని ట్రెజర్ హంటర్లు భావిస్తున్నారు. ఇందుకోసం ఐలాండ్ ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ అమెరికా నుంచి జర్మనీకి తరలిస్తున్న టన్నుల కొద్దీ బంగారం మునిగిపోయిన ఓడలో ఉందని ట్రెజర్ హంటర్ల నమ్మకం. 1939 రెండో ప్రపంచ యుద్ధం జరగుతున్న నేపథ్యంలో దక్షిణ అమెరికా నుంచి జర్మనీకి బయల్దేరిన ఈ ఓడను ఇంగ్లండ్ తన సముద్రజలాల్లో అడ్డుకుని దాడి చేసింది. దాంతో ఓడతో పాటు దక్షిణ అమెరికా నుంచి వస్తున్న విలువైన వస్తువులు సముద్ర అంతర్భాగంలో కలసిపోయాయి. దాదాపు నాలుగు టన్నుల బంగారం మునిగిపోయిన ఓడలో దాడి ఉందని పలువురి అభిప్రాయం. బంగారం విలువ దాదాపు 100 మిలియన్ పౌండ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓడలో ఉన్న బాక్సును వెలికితీసేందుకు బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఐలాండ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి పరిశోధనలు చేయాలని భావించినా ఆ దేశ ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో నేవీ ఒప్పుకోలేదు. దీంతో ఐలాండ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం బ్రిటన్ కంపెనీ వేచి చూస్తోంది. -
ఆన్ లైన్లో అమ్మకానికి నియంత వస్తువులు..!
లండన్: జర్మనీ నియంతగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన కొన్ని కోడింగ్ మేషిన్లను అమ్మకానికి పెట్టారు. యూకేలోని బ్లెక్లే పార్క్ నేషనల్ కంప్యూటింగ్ మ్యూజియం వాలంటీర్లు ఆన్ లైన్ మార్కెట్ ఈ-బే లో ఈ లోరేంజ్ మేషిన్లను గుర్తించారు. ఇవి జర్మనీకి చెందిన కోడింగ్ వస్తువులని, వాటి ధర దాదాపు రూ.100గా ట్యాగ్ పెట్టినట్లు తెలిపారు. ఈ-బే లో ఓ వస్తువు కోసం తనతోటి ఉద్యోగి వెతుకుతుండగా జర్మనీకి చెందిన లోరెంజ్ టెలీ ప్రింటర్ ను గుర్తించారని మ్యూజియం వాలంటీర్ జాన్ వెట్టర్ పేర్కొన్నాడు. నాజీ పార్టీ వారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వీటిని వాడినట్లు అభిప్రాయపడ్డాడు. లోరెంజ్ ఎస్.జెడ్ 42 మెషిన్ హిట్లర్ వాడినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో దాదాపు 200కు పైగా ఉండేవని, ప్రస్తుతం నాలుగు మాత్రమే లభ్యమయ్యాయని చెప్పారు. అయితే ఈ టెలీప్రింటర్ల సహాయంతో జనరల్ అధికారులతో హిట్లర్ సంభాషించేవాడని, వీటి ఉనికి 1970 దశకంలో మొదటగా వెలుగులోకి వచ్చిందని స్థానిక మీడియాతో కథనాలు వచ్చాయి. అయితే సీక్రెట్ కోడింగ్ ద్వారా వారు రహస్యాలపై చర్చించేవారు. నాజీ పార్టీకి చెందిన ప్రముఖులకు మాత్రమే వీటి వాడకం తెలుసునని యూకే అధికారులు అభిప్రాయ పడుతున్నారు.