లక్సెట్టిపేట: అదిలాబాద్ జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక గోదారి రోడ్డులోని మసీదు వెనక భాగంలో నివాస ముంటున్న ఎం.డీ. సలీం ఇంట్లో గత రెండు రోజులు గా రాత్రి పూట చప్పుడు వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులకు రంగంలోకి దిగారు. సలీం ఇంట్లో పరిశీలించగా.. ఇంటి మధ్య భాగంలో పెద్ద గొయ్యి కనిపించింది. గొయ్యి ఎందుకు తీసారో పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో సలీం కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.