
తిరుచిరాపల్లి : కేరళలోని పురాతన ఆలయంలో బంగారు నాణేలు లభ్యమయ్యాయి. తిరువనంతపురంలోని జంబూకేశ్వర్ ఆలయం వద్ద బుధవారం తవ్వకాలు చేపట్టగా ఏడడుగుల లోపల ఓ నౌకలో 1.7 కిలోల బరువున్న 505 బంగారు నాణేలు లభించాయి. వీటిలో 504 చిన్న నాణేలు కాగా, ఒక పెద్ద నాణెం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. అరబిక్ బాషలో ముద్రితమైన అక్షరాలున్న ఈ నాణేలు 100 నుంచి 1200 శతాబ్ధానికి చెందినవని భావిస్తున్నారు. నౌకలో దాచిన ఈ నాణేలను తాము గుర్తించామని అధికారులు చెబుతున్నారు. బంగారు నాణేలతో సహా నౌకను పోలీసులకు అప్పగించామని ఎండోమెంట్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment