Kerala temples
-
ఆ గుడిలో టాయిలెట్ వారికి మాత్రమే..
త్రిస్సూర్: కేరళలోని కుట్టుముక్కు మహదేవ దేవస్థానానికి చెందిన టాయిలెట్లలో ఒకటి బ్రాహ్మణులు మాత్రమే వినియోగించాలని రాసి ఉండటం కలకలం రేపింది. పురుషులు.. మహిళలు.. బ్రాహ్మణులు అంటూ మూడు బోర్డులతో మూడు టాయిలెట్లు ఉన్న ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు దీనికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ విషయం ఆలయ కమిటీ సభ్యుల వరకూ వెళ్లడంతో ఆ బోర్డును తొలగించి అర్చకులకు, ఉద్యోగులకు అని మార్చారు. దాదాపు 20 ఏళ్ల కిందట ఆ బోర్డు పెట్టారని, అది తమ నోటీసుకు రాలేదని కమిటీ సభ్యులు తెలిపారు. అనైతిక ఆచారాలకు ఆలయం, పాలకమండలి వ్యతిరేకమని స్థానిక వార్డు కౌన్సిలర్, సీపీఎం నేత కన్నన్ స్పష్టం చేశారు. మూడు బోర్డుల ఫొటోను సోషల్ మీడియాపై పోస్ట్ చేసిన వ్యక్తిపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల సమయంలో ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. (చదవండి: ఆ రెండు చానళ్లపై 48 గంటల నిషేధం) -
ఆలయం వద్ద బయటపడిన బంగారు నాణేలు
తిరుచిరాపల్లి : కేరళలోని పురాతన ఆలయంలో బంగారు నాణేలు లభ్యమయ్యాయి. తిరువనంతపురంలోని జంబూకేశ్వర్ ఆలయం వద్ద బుధవారం తవ్వకాలు చేపట్టగా ఏడడుగుల లోపల ఓ నౌకలో 1.7 కిలోల బరువున్న 505 బంగారు నాణేలు లభించాయి. వీటిలో 504 చిన్న నాణేలు కాగా, ఒక పెద్ద నాణెం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. అరబిక్ బాషలో ముద్రితమైన అక్షరాలున్న ఈ నాణేలు 100 నుంచి 1200 శతాబ్ధానికి చెందినవని భావిస్తున్నారు. నౌకలో దాచిన ఈ నాణేలను తాము గుర్తించామని అధికారులు చెబుతున్నారు. బంగారు నాణేలతో సహా నౌకను పోలీసులకు అప్పగించామని ఎండోమెంట్ అధికారులు తెలిపారు. చదవండి : రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..! -
ఆలయాల్లోని బంగారంపై రిజర్వ్ బ్యాంక్ ఆరా!
తిరువనంతపురం: మీ దగ్గర ఎంతెంత బంగారం ఉందో చెప్పండంటూ కేరళలోని దేవస్థానాలకు రిజర్వ్ బ్యాంక్ లేఖలు రాసింది. బంగారం నిల్వల గురించి వాకబు చేస్తూ దేవాలయాలకు లేఖలు రాసిన మాట నిజమేనని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ సంచాలకుడు సలీం గంగాధరన్ నిర్ధారించారు. అయితే, సమాచారం కోసం మాత్రమే బంగారం వివరాలు అడుగుతున్నామని, కొనే ఉద్దేశమేదీ లేదన్నారు. తిరువనంతపురంలోని సుప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో రూ. లక్ష కోట్ల విలువైన బంగారం ఉన్నట్లు 2011 జూలైలో సుప్రీంకోర్టు ప్రతినిధులు లెక్కతేల్చిన విషయం తెలిసిందే. కేరళలోని ఆలయాలను ఐదు బోర్డులు పర్యవేక్షిస్తున్నాయి. ప్రఖ్యాత శబరిమల ఆలయం ట్రావన్కోర్ బోర్డు పరిధిలోకి వస్తుంది.