త్రిస్సూర్: కేరళలోని కుట్టుముక్కు మహదేవ దేవస్థానానికి చెందిన టాయిలెట్లలో ఒకటి బ్రాహ్మణులు మాత్రమే వినియోగించాలని రాసి ఉండటం కలకలం రేపింది. పురుషులు.. మహిళలు.. బ్రాహ్మణులు అంటూ మూడు బోర్డులతో మూడు టాయిలెట్లు ఉన్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు దీనికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ విషయం ఆలయ కమిటీ సభ్యుల వరకూ వెళ్లడంతో ఆ బోర్డును తొలగించి అర్చకులకు, ఉద్యోగులకు అని మార్చారు.
దాదాపు 20 ఏళ్ల కిందట ఆ బోర్డు పెట్టారని, అది తమ నోటీసుకు రాలేదని కమిటీ సభ్యులు తెలిపారు. అనైతిక ఆచారాలకు ఆలయం, పాలకమండలి వ్యతిరేకమని స్థానిక వార్డు కౌన్సిలర్, సీపీఎం నేత కన్నన్ స్పష్టం చేశారు. మూడు బోర్డుల ఫొటోను సోషల్ మీడియాపై పోస్ట్ చేసిన వ్యక్తిపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల సమయంలో ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. (చదవండి: ఆ రెండు చానళ్లపై 48 గంటల నిషేధం)
Comments
Please login to add a commentAdd a comment