gold mine accident
-
బంగారు గనిలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి
బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో మరో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంగారు గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, పలువురి ఆచూకీ గల్లంతు అయినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.వివరాల ప్రకారం.. మాలిలోని బంగారు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కౌలికోరో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. కాగా, మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. అయితే, బంగారం వెతుకులాటకు వెళ్లి వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారని కౌలికోరో గవర్నర్ కల్నల్ లామైన్ కపోరీ సనొగో తెలిపారు. ఒక్కసారిగా బురదనీరు ప్రవేశించి మహిళలను చుట్టుముట్టిందని వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇటీవలే మాలిలో బంగారు గనిలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 25వ తేదీన మాలిలోని బంగారు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 70 మందికిపైగా మృత్యువాత పడ్డారు. అనధికారికంగా తవ్వకాలు చేపట్టే ఓ బంగారు గని కుప్ప కూలి 70 మంది మరణించారు. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక, ఆఫ్రికా దేశాల్లో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా మాలి ఉంది. ఈ దేశంలో గనుల ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.A landslide at a gold mine southern Mali’s village of Danga has killed around 10 people and left several others missing, most of them women, the governorate of the Koulikoro region said. pic.twitter.com/lH9OxXYZk1— The Sudan Times (@thesudantimes) January 30, 2025 -
ప్రాణాలు తీసిన బంగారం గని.. 21 మృతదేహాలు లభ్యం
జోహన్నెస్‌బర్గ్: అక్రమ మైనింగ్ కూలీల ప్రాణాలను బలి తీసుకుంది. బంగారం గనిలో అనుమతి లేకుండా తవ్వకాలు సాగిస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా 21 మృతదేహాలు లభ్యమయ్యాయి. దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ నగరానికి పశ్చిమాన ఉన్న క్రుగెర్స్‌డార్ప్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 19, గురువారం ఉదయం 2 మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలియజేశారు. గనిలో మరో చోట చనిపోయివారి మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు తాము అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఇది ప్రైవేట్ బంగారం గని, ఇక్కడ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని చెప్పారు. క్రుగెర్స్‌డార్ప్ ప్రాంతంలో గనులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ తరచుగా గనుల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది జూలైలో ఓ గనిలో సినిమా షూటింగ్ కోసం వచ్చిన 8 మంది మహిళలపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, వారివద్దనున్న సొత్తును దోచుకున్నారు. -
బంగారు గనిలో పేలుడు.. 59 మంది దుర్మరణం
Mining operations in Burkina Faso: పశ్చిమ ఆఫ్రికాలో వరుస పేలుళ్లు చోటచేసుకున్నాయి. బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రల్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం జరిగిన ఈ పేలుడు.. బంగారు గనిలో బంగారం తవ్వడానికి ఉపయోగించే రసాయనాల వల్ల సంభవించినట్లు తెలుస్తోంది. -
బంగారు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణం
బీజింగ్/ జినాన్: చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న బంగారు గనిలో పేలుడు సంభవించిన రెండు వారాలకు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. జనవరి 10వ తేదీన బంగారు గనిలో ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది. దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మట్టి కూరుకుపోవడంతో మరింత కష్టమైంది. వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందిన అధికారులు వీలైనంత త్వరగా బయటకు తీసుకొద్దామని ప్రయత్నించారు. రెండు వారాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని 25వ తేదీన బయటకు తీసుకొచ్చారు. అయితే అధికారులు చేరుకునేలోపు 10 మంది మరణించగా, మరో 11 మంది ప్రాణాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరొక వ్యక్తి ఆచూకీ లభించలేదు. అతడి కోసం అధికారులు వెతుకున్నారు. అయితే గనిలో పేలుడుకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. చైనాలో మైనింగ్ పరిశ్రమలో ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ఏటా దాదాపు 5 వేల మంది మరణిస్తుంటారని ఆ దేశ మీడియా తెలిపింది. -
కూలిన బంగారు గని.. 30 మంది మృతి
కుందుజ్: అఫ్గానిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి బదక్షన్ ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలో కార్మికులు పనిచేస్తుండగా గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ విషయమై కోహిస్తాన్ గవర్నర్ మొహమ్మద్ రుస్తమ్ రఘీ మాట్లాడుతూ.. ఇక్కడి గ్రామస్తులు నదీతీరంలో బంగారం కోసం 200 అడుగుల లోతైన గనిని తవ్వారని తెలిపారు. అనంతరం లోపలకు దిగి తవ్వకాలు జరుపుతుండగా పైనున్న గోడ ఒక్కసారిగా విరిగిపడిపోయిందని వెల్లడించారు. మరింత లోతుగా గనిని తవ్వేందుకు గ్రామస్తులు యంత్రాన్ని ఉపయోగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. వీరంతా సాధారణ గ్రామీణులనీ, నిపుణులు కారని వ్యాఖ్యానించారు. ఈ గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఖనిజాలను తవ్వుతున్నారనీ, వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేదని స్పష్టం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే సహాయక బృందాలను పంపామన్నారు. క్షతగాత్రులను రక్షణశాఖ హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 50,000 అఫ్గానీలు, క్షతగాత్రుల కుటుంబాలకు 10,000 అఫ్గానీలు నష్టపరిహారంగా అందిస్తామని ప్రకటించారు. అఫ్గానిస్తాన్ లో అక్రమ మైనింగ్‌అన్నది సర్వసాధారణం. తాలిబన్ ఉగ్రవాదులు ఆదాయం కోసం ప్రధానంగా మైనింగ్‌పైనే ఆధారపడుతున్నారు. -
బంగారుగనిలో చిక్కుకున్న కార్మికులు
కొలంబియాలోని ఓ బంగారం గని ఉన్నట్టుండి కూలిపోవడంతో 15 మంది కూలీలు అందులో చిక్కుకుపోయారు. కొలంబియాలోని కాల్డస్ రియోసుసియో రాష్ట్రంలో ఈ గని ఉంది. యూఎన్జీఆర్డీ సంస్థ సహాయ కార్యకలాపాలను సమన్వయం చేస్తోంది. ఆఫ్రికన్ దేశాల్లో, అందునా కొలంబియాలో బంగారు గనులు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశ జాతీయాదాయంలో గనుల నుంచి వచ్చే ఆదాయం వాటా 2.3 శాతం ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే చాలా వరకు అనధికారికంగా, లైసెన్సు లేకుండా నిర్వహించే గనులు కావడంతో.. ఇక్కడ జరిగే ప్రమాదాల విషయం కూడా సాధారణంగా బయటపడదు. ఇప్పుడు ప్రమాదం జరిగిన గనికి కూడా లైసెన్సు ఉందో లేదో దర్యాప్తు చేయనున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.