బంగారుగనిలో చిక్కుకున్న కార్మికులు
కొలంబియాలోని ఓ బంగారం గని ఉన్నట్టుండి కూలిపోవడంతో 15 మంది కూలీలు అందులో చిక్కుకుపోయారు. కొలంబియాలోని కాల్డస్ రియోసుసియో రాష్ట్రంలో ఈ గని ఉంది. యూఎన్జీఆర్డీ సంస్థ సహాయ కార్యకలాపాలను సమన్వయం చేస్తోంది. ఆఫ్రికన్ దేశాల్లో, అందునా కొలంబియాలో బంగారు గనులు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశ జాతీయాదాయంలో గనుల నుంచి వచ్చే ఆదాయం వాటా 2.3 శాతం ఉంటుంది.
అలాగే ఇక్కడ ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే చాలా వరకు అనధికారికంగా, లైసెన్సు లేకుండా నిర్వహించే గనులు కావడంతో.. ఇక్కడ జరిగే ప్రమాదాల విషయం కూడా సాధారణంగా బయటపడదు. ఇప్పుడు ప్రమాదం జరిగిన గనికి కూడా లైసెన్సు ఉందో లేదో దర్యాప్తు చేయనున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.