
జమ్మూ: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం(మార్చ్ 29) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్‌ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment