Jammu srinagar
-
జమ్మూ- శ్రీనగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
జమ్మూ: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం(మార్చ్ 29) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం -
బస్సు లోయలో పడి.. 20 మంది దుర్మరణం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు లోయలో పడి 20 మంది మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలోని కెలా మోత్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు బనిహల్ నుంచి రంబన్ వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కాశ్మీర్ వరద మృతులకు దలైలామా సంతాపం
ధర్మశాల : జమ్మూ కాశ్మీర్ వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధమత గురువు దలైలామా గురువారం సంతాపం తెలిపారు. వరదల బీభత్సంతో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఆయన జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రాసిన ఓ లేఖలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించవల్సిందిగా దలైలామా సూచించారు. అలాగే వినాశకరమైన వైపరీత్యంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దలైలామా ట్రస్ట్ నుంచి విరాళం ప్రకటించారు. విరాళాన్ని ముఖ్యమంత్రి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కు పంపించినట్లు ధర్మశాలలోని దలైలామా కార్యాలయం వెల్లడించింది. మరోవైపు భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ వరద ప్రాంతాల్లో 77 వేలమంది బాధితులను రక్షించారు. మృతుల సంఖ్య 215కి పెరిగింది. -
వరద బాధితులను ఆదుకునేందుకు సైన్యం చర్యలు
శ్రీనగర్: భారీ వరదల వల్ల అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ పర్యటిస్తున్నారు. సైన్యం ఇప్పటి వరకు 4 లక్షల మందికి సహాయ సామాగ్రాని అందజేయగా, వరద ప్రాంతాల్లో 80 వేలమంది బాధితులను రక్షించారు. సహాయక చర్యల్లో 3 వేల మంది జవాన్లు పాల్గొంటున్నారు. 97 హెలీకాప్టర్లను వాడుతున్నారు.