మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రధానోత్సవంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 11 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ ఘటనపై ఎవరూ సమగ్రంగా దర్యాప్తు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు. ముంబై ఖార్గర్‌లో జరిగిన అవార్డు వేడుకను సరిగా ప్లాన్ చేయలేదని విమర్శించారు.
ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రే, ఎన్సీపీ నాయకుడు అజిత పవార్ ఎంజీఎం కమోతేతో కలిసి ఆ కార్యక్రమంలో వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరణించిన కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులను భరిస్తుందని సీఎం షిండే ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
(చదవండి: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment