భారతీయులకు స్వల్ప ఊరట లభించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,793 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్‌తో 27 మంది మృతిచెందారు. ఇక, కరోనా నుంచి 9,486 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 96,700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశంలో 43,418,839 మంది వైరస్ బారినపడగా.. కరోనాతో 5,25,047 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 4,27,97,092 కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది. భారత్‌లో సోమవారం 19,21,811 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది.
మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 366,742 మంది కరోనా బారినపడగా.. మరో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,351,925కు చేరుకుంది.
ఇది కూడా చదవండి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 25 మంది..
Comments
Please login to add a commentAdd a comment