Recovers
-
భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారతీయులకు స్వల్ప ఊరట లభించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,793 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్‌తో 27 మంది మృతిచెందారు. ఇక, కరోనా నుంచి 9,486 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 96,700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశంలో 43,418,839 మంది వైరస్ బారినపడగా.. కరోనాతో 5,25,047 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 4,27,97,092 కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది. భారత్‌లో సోమవారం 19,21,811 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 366,742 మంది కరోనా బారినపడగా.. మరో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,351,925కు చేరుకుంది. ఇది కూడా చదవండి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 25 మంది.. -
కరోనాను జయించిన వందేళ్ల బామ్మ
సారవకోట: ఆత్మస్థైర్యంతో ఉంటే ఎలాంటి సమస్య ఎదురైనా బయటపడవచ్చని నిరూపించారు ఓ వందేళ్ల వృద్ధురాలు. కరోనా మహమ్మారి సోకినా భయపడకుండా వైద్యుల సలహాలు పాటిస్తూ సురక్షితంగా కోలుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన 100 ఏళ్ల బామ్మ యాళ్ల సీతారామమ్మకు ఏప్రిల్ 20న కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను కుటుంబ సభ్యులు హోం ఐసొలేషన్‌లో ఉంచారు. సకాలంలో మందులు వేసుకుంటూ, వైద్యుల సలహాలు పాటించడంతో ఆమె కోలుకున్నారు. ఆహారం ఇలా... ♦ఉదయం నిమ్మరసంతో కూడిన తేనె, గుడ్డు అల్పాహారంలో ఇడ్లీ, అట్లు, పూరీలు వంటివి ♦రెండు గంటల విరామం తర్వాత మజ్జిగ ♦మధ్యాహ్న భోజనంలో చికెన్, చేపలు, గుడ్లతో పాటు అన్నం. సాయంత్రం బొప్పాయి, యాపిల్ ♦రాత్రి భోజనంలో కాకరకాయ బెల్లం కూర, గుడ్డు, ఇతర కూరగాయలతో అన్నం. ♦పడుకునే ముందు ఎండు ద్రాక్ష ♦మొదటి నుంచి అలవాటు ప్రకారం నీరు ఎక్కువగా తాగానని సీతారామమ్మ చెప్పారు. మందులు.. ప్రభుత్వం అందించిన హోం ఐసొలేషన్ కిట్‌తో పాటు వైద్యుల సలహా మేరకు కొన్ని మందుల్ని వినియోగించారు. ఈమె మనవడు యాళ్ల భూషణరావు స్థానిక పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తుండటంతో ఈమె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఈమె ఆక్సిజన్ స్థాయి 97 నుంచి 98 వరకు ఉంది. చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’ కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు -
కరోనా నుంచి కోలుకున్న ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
-
కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ
నాదెండ్ల (చిలకలూరిపేట): కరోనా బారి నుంచి 92 ఏళ్ల బామ్మ కోలుకుంది. గుంటూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన సింగు కామేశ్వరమ్మ ఏప్రిల్ 16న అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమె డిశ్చార్జయ్యి గత నెలాఖరున ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంది. చదవండి: త్వరలో ఏపీకి 9 లక్షల కోవిడ్ టీకాలు జలమార్గంలో చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు -
రుణం చెల్లించనందుకు బస్సు ‘హైజాక్’!
సాక్షి, బెంగళూరు: తీసుకున్న రుణం చెల్లించనందుకు ఓ సంస్థకు చెందిన బస్సును ప్రయాణికులు ఉండగానే ఫైనాన్స్ సిబ్బంది హైజాక్ చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి కేరళకు 42 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సును ఆర్.ఆర్.నగర్లో శుక్రవారం రాత్రి రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు అడ్డుకున్నారు. తాము పోలీసులమనీ, తనిఖీలు చేయాలంటూ ప్రయాణికులతో సహా బస్సును సమీపంలోని గోడౌన్‌కు తరలించారు. అనంతరం అక్కడకు మరో ఏడుగురు చేరుకున్నారు. గోడౌన్‌కు తాళం వేసి బస్సును కదలకుండా చేశారు. దీంతో భయపడ్డ ప్రయాణికులు కొందరు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన దుండగులు అక్కడ్నుంచి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. బస్సు కొనుగోలు సమయంలో ఇచ్చిన అప్పును యజమాని తిరిగిచెల్లించకపోవడంతో సదరు ఫైనాన్సింగ్ సంస్థ ఈ నిర్వాకానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. -
పడవ ప్రమాదంలో 8 మంది మృతి
కౌలాలంపూర్: మలేషియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. శరణార్ధులతో ప్రయాణిస్తున్న ఓ బోట్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం మలేషియా తీరప్రాంత సహాయక బృందాలు సోమవారం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 62 మంది ఉన్నారు. 34 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఇండొనేషియాకు చెందిన శరణార్థులు అక్రమంగా మలేషియాలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రాణాలతో బయటపడిన వారిని తిరిగి ఇండొనేషియాకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో తనతో పాటే ఉన్న భార్యను కాపాడుకోలేకపోయానంటూ ఓ వ్యక్తి స్థానిక మీదియాతో మాట్లాడుతూ బోరున విలపించాడు. -
బ్రెగ్జిట్ ఫలితానికై ఎదురు చూస్తున్న మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. బ్రెగ్జిట్ రెఫరండం ఫలితాలకోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే ట్రేడవుతున్నాయి. దీంతో 3 పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్ 26,763 దగ్గర ఉండగా, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 8196 దగ్గర ఉంది. ఎఫ్ ఎంసీజీ, , బ్యాంకింగ్, బెటల్, హెల్త్ కేర్ ఆటో రంగాలు పాజిటివ్ గా ఉన్నాయి. బ్రెగ్జిట్ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ పరిణామాలను గమనిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్థిక మార్కెట్లలో సక్రమమైన పరిస్థితులు నిర్ధారించడానికి ద్రవ్యత మద్దతు సహా అవసరమైన చర్యలను తీసుకుంటామని తెలిపింది. మరోవైపు సెబీ మరియు స్టాక్ ఎక్సేంజ్ బ్రెగ్జిట్ ఫలితంపై ఆత్రుతతో పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్న ఎలాంటి అస్థిరతనైనా పరిష్కరించేందుకు వీలుగా నిఘా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేశారు . ఆసియా , హాంగ్ కాంగ్ తదితర మార్కెట్లు కూడా నెగిటివ్ గాఉన్నాయి. అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ పాజిటివ్ గా ఉంది. 15 పైసల కోలుకొని 67.33 దగ్గర ఉండగా, బులియన్ మార్కెట్ కూడా నెగిటివ్ గానే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి 100 రూ. నష్టపోయి రూ. 30, 006 దగ్గర ఉంది. -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభం అనంతరం బీఎస్సీ సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 28,866 దగ్గర ఉండగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 8231 దగ్గర ఉంది. రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య, విద్యుత్, పీఎస్‌యూ, క్యాపిటల్ గూడ్స్, రికవరీ ప్రముఖ బ్యాంకింగ్ స్టాక్స్ లో స్వల్ప రికవరీ కనిపిస్తోంది. ఇతర ప్రాంతీయ మార్కెట్లలో మిశ్రమ స్పందన కు తోడు బ్లూచిప్ షేర్లలో మదుపరులు చూపిస్తున్న కొనుగోలు సెంటిమెంట్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోందని బ్రోకర్లు తెలిపారు. బ్రెగ్జిట్ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ పాజిటివ్ గా ఉంది. 0.08 పైసల లాభంతో 67.57 దగ్గర ఉంది. కాగాబిలియన్ మార్కెట్ల మాత్రం నెగిటివ్ గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి రూ. 30,229 దగ్గర ఉంది. -
'యాపిల్' రీసైక్లింగ్ లో టన్ను బంగారం!
కంచి పట్టు చీరలు పాతవైనా వాటికో విలువ ఉంటుంది. ఎందుకంటే వాటి నేతకు వినియోగించే బంగారం, వెండి, కాపర్ వంటి వస్తువులు తిరిగి పనికొస్తాయి. అలాగే యాపిల్ ఐ ఫోన్లు బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. పాతపడిపోయినా అందులో వినియోగించే వస్తువులవల్ల కూడ దానికో విలువ ఉంటుందన్నమాట. ఇటీవల యాపిల్ కంపెనీ పాత ఫోన్లు రీసైకిల్ చేసి ఏకంగా ఓ టన్ను బంగారాన్ని సేకరించిందట. అంతేకాదు దాంతోపాటు ఫోన్లో వినియోగించే అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి పదార్థాలను కూడ మిలియన్ల కొద్దీ టన్నులు సంపాదించిందట. యాపిల్ డివైజ్ లను రీ సైకిల్ చేయడం ద్వారా ఒక సంవత్సరంలో కంపెనీ ఓ టన్నుకు పైగా బంగారాన్ని సేకరించిందట. దాంతోపాటు 10.4 మిలియన్ కిలోల స్టీల్, రెండు మిలియన్ కిలోల అల్యూమినియం, 1.4 మిలియన్ కిలోల రాగిని కూడ సేకరించింది. ఒక్క బ్రాండ్ నేమ్ కే కాదు... ఫోన్ లో వినియోగించే వస్తువులు కూడ విలువైనవి కావడంతోనే యాపిల్ ఫోన్ కు అంత క్రేజ్ ఉందన్నమాట. పూర్తిగా పారేసే బదులు అవసరం లేని, పనికిరాని వస్తువులు పాత సామాన్ల వాళ్ళకి అమ్మేస్తుంటాం. అలానే యాపిల్ కంపెనీకూడ పనికిరాని ఐఫోన్లు, ఐ ప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్ల నుంచి 2015 సంవత్సరంలో సుమారు 28 మిలియన్ల యూరోలు ఖరీదైన మెటల్ ను సేకరించి సొమ్ము చేసుకుందట. మంచి బ్రాండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా పాడవకుండా ఉండేందుకు వాటిలో కొద్దిపాటి బంగారాన్ని కూడ వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ రీ సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా పనికిరాని, పాత యాపిల్ వస్తువులను వినియోగదారులకు డబ్బు చెల్లించి కొనుగోలు చేసి కర్మాగారంలో శుద్ధి చేస్తుంది. ఇందులో లక్షల ఖరీదైన ఉక్కు, అల్యూమినియం, రాగిని సేకరించింది. తమ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీలో నాణ్యతకోసం ఖరీదైన, విలువైన వస్తువులను వాడతామని యాపిల్ కంపెనీ సంవత్సరాంతపు రీసైక్లింగ్ నివేదికలో వెల్లడించింది. అంతేకాక ఇలా రీ సైకిల్ చేయడంవల్ల ఆయా పరికరాల్లోని పునరుత్పాదక శక్తి వినియోగంతోపాటు.. ప్రకృతికి, మనుషులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుందని తెలిపింది. తమ కంపెనీ వస్తువులద్వారా చైనా సరఫరాదారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిశుభ్రతను పాటించే అవకాశం ఉంటుందని యాపిల్ తన నివేదికలో తెలిపింది.