ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభం అనంతరం బీఎస్సీ సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 28,866 దగ్గర ఉండగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 8231 దగ్గర ఉంది. రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య, విద్యుత్, పీఎస్యూ, క్యాపిటల్ గూడ్స్, రికవరీ ప్రముఖ బ్యాంకింగ్ స్టాక్స్ లో స్వల్ప రికవరీ కనిపిస్తోంది. ఇతర ప్రాంతీయ మార్కెట్లలో మిశ్రమ స్పందన కు తోడు బ్లూచిప్ షేర్లలో మదుపరులు చూపిస్తున్న కొనుగోలు సెంటిమెంట్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోందని బ్రోకర్లు తెలిపారు. బ్రెగ్జిట్ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ పాజిటివ్ గా ఉంది. 0.08 పైసల లాభంతో 67.57 దగ్గర ఉంది. కాగాబిలియన్ మార్కెట్ల మాత్రం నెగిటివ్ గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి రూ. 30,229 దగ్గర ఉంది.
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
Published Wed, Jun 22 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement