నష్టాల్లో స్టాక్మార్కెట్లు
ముంబై: మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. దాదాపు 50 పాయింట్ల లాభంతో ప్రారంభమై సుమారు 115 పాయింట్లకు పైగా కోల్పోయింది. సెన్సెక్స్ 113 పాయింట్ల నష్టంతో 28,075 దగ్గర, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 8,509 దగ్గర ట్రేడవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ద్వైమాసిక పరపతి విధానం సమీక్షను మంగళవారం వెల్లడించనుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించాల్సిందిగా పారిశ్రామిక వర్గాలనుంచి ఒత్తిళ్ల భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలక రేట్లు యథాదథంగా ఉండే అవకాశాలున్నాయని మార్కెట్లు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పావుశాతం తగ్గించొచ్చని మరికొన్ని సంస్థలు భావిస్తున్నాయి.
అటు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి గత రెండు రోజులుగా నిలదొక్కుకున్నట్టు కనిపించినా మళ్ళీ 64 రూపాయలకు చేరుకుంది. అయిదుపైసల నష్టంతో 64.09 దగ్గర ఉంది.