early trade
-
డాలర్‌కు డిమాండ్ : రూపీ డౌన్
ముంబై : అనూహ్య రీతిలో పరుగులు పెట్టిన డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్లీ కిందకి దిగజారింది. అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్ బలపడుతుండటంతో రూపాయి 10 పైసలు పడిపోయి 66.98గా ట్రేడవుతోంది. డాలర్ బలపడటమే కాకుండా దేశీయంగా పారిశ్రామికోత్పత్తి క్షీణించడంతో రూపాయికు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. డిసెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 0.04 శాతం క్షీణించింది. దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి భారీగా డిమాండ్ ఏర్పడుతుండటంతో డాలర్ బలపడుతుందని ఫారెక్స్ డీలర్స్ చెబుతున్నారు. ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం పుంజుకుంటుందని, దీంతో రూపాయి మీద ఒత్తిడి కొనసాగుతుందన్నారు. శుక్రవారం రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 3 పైసలు మాత్రమే పడిపోయింది. మరోవైపు మార్నింగ్ ట్రేడ్‌లో సెన్సెక్స్ 124.55 పాయింట్లు పైకి ఎగిసింది. -
బ్రెగ్జిట్ ఫలితానికై ఎదురు చూస్తున్న మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. బ్రెగ్జిట్ రెఫరండం ఫలితాలకోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే ట్రేడవుతున్నాయి. దీంతో 3 పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్ 26,763 దగ్గర ఉండగా, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 8196 దగ్గర ఉంది. ఎఫ్ ఎంసీజీ, , బ్యాంకింగ్, బెటల్, హెల్త్ కేర్ ఆటో రంగాలు పాజిటివ్ గా ఉన్నాయి. బ్రెగ్జిట్ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ పరిణామాలను గమనిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్థిక మార్కెట్లలో సక్రమమైన పరిస్థితులు నిర్ధారించడానికి ద్రవ్యత మద్దతు సహా అవసరమైన చర్యలను తీసుకుంటామని తెలిపింది. మరోవైపు సెబీ మరియు స్టాక్ ఎక్సేంజ్ బ్రెగ్జిట్ ఫలితంపై ఆత్రుతతో పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్న ఎలాంటి అస్థిరతనైనా పరిష్కరించేందుకు వీలుగా నిఘా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేశారు . ఆసియా , హాంగ్ కాంగ్ తదితర మార్కెట్లు కూడా నెగిటివ్ గాఉన్నాయి. అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ పాజిటివ్ గా ఉంది. 15 పైసల కోలుకొని 67.33 దగ్గర ఉండగా, బులియన్ మార్కెట్ కూడా నెగిటివ్ గానే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి 100 రూ. నష్టపోయి రూ. 30, 006 దగ్గర ఉంది. -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభం అనంతరం బీఎస్సీ సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 28,866 దగ్గర ఉండగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 8231 దగ్గర ఉంది. రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య, విద్యుత్, పీఎస్‌యూ, క్యాపిటల్ గూడ్స్, రికవరీ ప్రముఖ బ్యాంకింగ్ స్టాక్స్ లో స్వల్ప రికవరీ కనిపిస్తోంది. ఇతర ప్రాంతీయ మార్కెట్లలో మిశ్రమ స్పందన కు తోడు బ్లూచిప్ షేర్లలో మదుపరులు చూపిస్తున్న కొనుగోలు సెంటిమెంట్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోందని బ్రోకర్లు తెలిపారు. బ్రెగ్జిట్ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ పాజిటివ్ గా ఉంది. 0.08 పైసల లాభంతో 67.57 దగ్గర ఉంది. కాగాబిలియన్ మార్కెట్ల మాత్రం నెగిటివ్ గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి రూ. 30,229 దగ్గర ఉంది. -
ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 12 పాయింట్ల లాభంతో 27,377 దగ్గర, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 8280 దగ్గర ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు, దేశీయ మార్కెట్ లో ఇటీవలి లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లకు పైగా లాభపడింది. ముఖ్యంగా మెటల్, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయినా ట్రెండ్ పాజిటివ్ గానే ఉందని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అటు డాలర్ తో పోలిస్లే రూపాయి బలహీనంగా ట్రేడవుతోంది. 16 పైసలు నష్టంతో వరుసగా నాలుగవ రోజు కూడా వీక్ గా కొనసాగుతోంది. మరోవైపు డాలర్ కొనుగోలులో పెరుగుతున్న మద్దతు మూలంగా అటు పసిడి ధర తగ్గు ముఖం పట్టింది. మరింత దిగి రావచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
ముంబై: మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. దాదాపు 50 పాయింట్ల లాభంతో ప్రారంభమై సుమారు 115 పాయింట్లకు పైగా కోల్పోయింది. సెన్సెక్స్ 113 పాయింట్ల నష్టంతో 28,075 దగ్గర, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 8,509 దగ్గర ట్రేడవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ద్వైమాసిక పరపతి విధానం సమీక్షను మంగళవారం వెల్లడించనుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించాల్సిందిగా పారిశ్రామిక వర్గాలనుంచి ఒత్తిళ్ల భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలక రేట్లు యథాదథంగా ఉండే అవకాశాలున్నాయని మార్కెట్లు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పావుశాతం తగ్గించొచ్చని మరికొన్ని సంస్థలు భావిస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి గత రెండు రోజులుగా నిలదొక్కుకున్నట్టు కనిపించినా మళ్ళీ 64 రూపాయలకు చేరుకుంది. అయిదుపైసల నష్టంతో 64.09 దగ్గర ఉంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: మంగళవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు వంద పాయింట్లకు పైగా లాభపడ్డాయి. దీంతో ఇన్వెస్లర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. భారీ ఒడిదుడుకులకు లోనవుతూ తిరిగి పుంజుకుని ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 27,589 దగ్గర, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 8,370 దగ్గర వున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి కోలుకుంది. దాదాపు 12 పైసలు లాభపడి 64.04 దగ్గర ఉంది. -
రికార్డు స్థాయిలో సెన్సెక్స్, నిప్టీ
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 28వేల స్థాయిని అధిగమిస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 8,400 మార్క్ పాయింట్లను దాటింది. రికార్డ్ స్థాయిలో స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 28,260.66 వద్దకు, నిఫ్టీ 8,447.40 వద్దకు చేరింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇక రూపాయి కూడా 8 పైసలు నష్టపోయింది. ప్రస్తుతం డాలర్ విలువ 61.81గా ఉంది. -
భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 14౦ పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు పైగా లాభపడ్డాయి. రికార్డ్ స్థాయిలో స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 27,500 పాయింట్లు దాటగా, నిఫ్టీ 8,200 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.61.35గా ఉంది. -
మార్కెట్లో దీపావళి
-
భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 26,450 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7,885 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. చైనా స్టాక్ మార్కెట్లు కూడా ఉదయం లాభాలతోనే ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ భారీ విజయాలు సాధించడం కూడా భారత స్టాక్ మార్కెట్లకు మంచి సెంటిమెంటుగా మారింది. డీజిల్ ధరల మీద నియంత్రణను పూర్తిగా ఎత్తేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా ఓఎన్జీసీ, హెచ్పీసీసెల్, ఐఓసీ, ఆయిల్ ఇండియా లాంటి ప్రభుత్వరంగ చమురు సంస్థల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఇక రూపాయి కూడా 22 పైసలు లాభపడింది. ప్రస్తుతం డాలర్ విలువ 61.22 రూపాయలుగా ఉంది.