cautious
-
భారత్‌లోని ఆ నగరాల్లో జాగ్రత్త: తమ పౌరులకు కెనడా అడ్వైజరీ
భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం చల్లారడం లేదు. ఖలిస్తానీ సానుభూతిపరుడు నిజ్జార్ సింగ్ హత్యతో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేడంతో మొదలైన ఇరు దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు.. నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా పేర్కొంది. ఈ మేరకు కెనడా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. భారత్‌లో 41 మంది దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుని, తమ దౌత్యకార్యాలయాలు, కాన్సులేట్లను మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించిన గంటల వ్యవదిలోనే.. కెనడా ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘భారత్, కెనడా మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. మీడిమా, సామాజిక మాద్యమాల్లో మీడియాలో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కెనడా వ్యతిరేక ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కెనడియన్లకు బెదిరింపులు అందవచ్చు. వేధింపులకు గురికావచ్చు. జాతీయ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో(ఎన్సీఆర్) జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో ఎక్కువగా మాట్లడకండి. కొత్త వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దు’ అని అడ్వైజరీలో పేర్కొంది. చదవండి: భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ బెంగళూరు, చండీగఢ్, ముంబై నగరాల్లోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పెద్ద నగరాల్లో, పర్యాటక ప్రాంతాల్లో విదేశీయులు లక్ష్యంగా చేసుకుని కొంత మంది డబ్బు, పర్స్ దొంగతనాలకు పాల్పడుతుంటారని.. రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా వ్యహరించాలని, పెద్ద సంఖ్యలో డబ్బులు తీసుకెళ్లవద్దంటూ పేర్కొంది. అదే విధంగా సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, బెంగళూరులోని కాన్సులేట్లలో అన్ని రకాల ఇన్-పర్సన్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మూడు నగరాల్లోని తమ పౌరులను జాగ్రత్తగా ఉండాలని కోరింది. భారతదేశంలోని కెనడియన్లందరూ తమకు సహాయం కావాలంటే న్యూ ఢిల్లీలోని హైకమిషన్‌ను సంప్రదించవలసిందిగా కోరారు. -
బ్రెగ్జిట్ ఫలితానికై ఎదురు చూస్తున్న మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. బ్రెగ్జిట్ రెఫరండం ఫలితాలకోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే ట్రేడవుతున్నాయి. దీంతో 3 పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్ 26,763 దగ్గర ఉండగా, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 8196 దగ్గర ఉంది. ఎఫ్ ఎంసీజీ, , బ్యాంకింగ్, బెటల్, హెల్త్ కేర్ ఆటో రంగాలు పాజిటివ్ గా ఉన్నాయి. బ్రెగ్జిట్ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ పరిణామాలను గమనిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్థిక మార్కెట్లలో సక్రమమైన పరిస్థితులు నిర్ధారించడానికి ద్రవ్యత మద్దతు సహా అవసరమైన చర్యలను తీసుకుంటామని తెలిపింది. మరోవైపు సెబీ మరియు స్టాక్ ఎక్సేంజ్ బ్రెగ్జిట్ ఫలితంపై ఆత్రుతతో పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్న ఎలాంటి అస్థిరతనైనా పరిష్కరించేందుకు వీలుగా నిఘా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేశారు . ఆసియా , హాంగ్ కాంగ్ తదితర మార్కెట్లు కూడా నెగిటివ్ గాఉన్నాయి. అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ పాజిటివ్ గా ఉంది. 15 పైసల కోలుకొని 67.33 దగ్గర ఉండగా, బులియన్ మార్కెట్ కూడా నెగిటివ్ గానే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి 100 రూ. నష్టపోయి రూ. 30, 006 దగ్గర ఉంది. -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభం అనంతరం బీఎస్సీ సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 28,866 దగ్గర ఉండగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 8231 దగ్గర ఉంది. రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య, విద్యుత్, పీఎస్‌యూ, క్యాపిటల్ గూడ్స్, రికవరీ ప్రముఖ బ్యాంకింగ్ స్టాక్స్ లో స్వల్ప రికవరీ కనిపిస్తోంది. ఇతర ప్రాంతీయ మార్కెట్లలో మిశ్రమ స్పందన కు తోడు బ్లూచిప్ షేర్లలో మదుపరులు చూపిస్తున్న కొనుగోలు సెంటిమెంట్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోందని బ్రోకర్లు తెలిపారు. బ్రెగ్జిట్ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ పాజిటివ్ గా ఉంది. 0.08 పైసల లాభంతో 67.57 దగ్గర ఉంది. కాగాబిలియన్ మార్కెట్ల మాత్రం నెగిటివ్ గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి రూ. 30,229 దగ్గర ఉంది.