న్యూఢిల్లీ: దేశంలో అభయారణ్యాల్లో పులుల మరణాలపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో పులులు చనిపోతున్నాయంటూ వచ్చిన వార్తా కథనాలపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.
దేశవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్నందున వాటిని రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) గణాంకాల ప్రకారం..దేశంలో 2012 నుంచి ఇప్పటి వరకు 1,059 పులులు మరణించాయి. వీటిలో ఏకంగా 270 పులులు టైగర్ స్టేట్‌గా పేరున్న మధ్యప్రదేశ్‌లోనివే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment