Father Died After Hearing The News Of His Son Death In Sangareddy District, Details Inside - Sakshi
Sakshi News home page

Sangareddy: విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి 

Published Sat, Aug 5 2023 7:04 PM | Last Updated on Sat, Aug 5 2023 8:00 PM

Father And Son Died In Sangareddy District - Sakshi

సాక్షి, సంగారెడ్డి: కన్న కొడుకు మరణ వార్త విన్న తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వీరిద్దరి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ తండాకూ చెందిన బానోత్ భీమ్లా శుక్రవారం బైక్‌పై జోగిపేట్ పట్టణానికి మోటర్ రిపేర్ కోసం వెళ్లాడు. అనంతరం, ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో అల్మాయిపేట సబ్‌స్టేషన్‌ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కకు బైక్‌ పార్క్‌ చేశాడు. అనంతరం 161 నాందేడ్‌ జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో, ఘటనా స్థలంలోనే భీమ్లా మృతిచెందాడు. 

ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, కొడుకు బానోత్‌ భీమ్లా మరణ వార్త విని అతడి తండ్రి ధర్మ నాయక్‌ గుండెపోటుతో మరణించాడు. ఇక, ఇద్దరి మరణంలో తండాలో విషాదం నెలకొంది. 

ఇది కూడా చదవండి: బైక్‌పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్‌ వదిలి పరార్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement