
ఢిల్లీ: దేశంలో కరోనా టెన్షన్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది.
గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 18,389 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. ఇక, శనివారంతో పొల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య 27 శాతం పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, శనివారం దేశవ్యాప్తంగా 2,995 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, వైరస్ బారినపడి ఇప్పటి వరకు 5,30,881 మృతిచెందినట్టు పేర్కొంది.
India reports 3,824 new cases of Covid-19 in 24 hours; the active caseload stands at 18,389. pic.twitter.com/i4AOCyHAj3
— ANI (@ANI) April 2, 2023