హజ్‌ యాత్ర మృతులపై సౌదీ అధికారిక ప్రకటన.. మరణాలు ఎన్నంటే? | Saudi Arabia Says 1300 People Died During Hajj Pilgrimage In 2024 | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్ర మృతులపై సౌదీ అధికారిక ప్రకటన.. మరణాలు ఎన్నంటే?

Published Mon, Jun 24 2024 8:07 AM | Last Updated on Mon, Jun 24 2024 2:23 PM

Saudi Arabia Says 1300 People Died During Hajj Pilgrimage In 2024

ఇటీవల సౌదీ అరేబియాలో హజ్‌ యాత్ర సందర్భంగా‌ యాత్రికులు మృత్యువాతపడ్డారు. ఈ సందర్భంగా యాత్రకు వచ్చిన వారిలో 1301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో అస్వస్థతకు గురైన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు చెప్పుకొచ్చింది.

కాగా, సౌదీ అరేబియా హజ్‌ యాత్రకు ఈ ఏడాది పలు దేశాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చారు. దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు రెండు లక్షలకుపైగా హాజరయ్యారు. పది లక్షలకు మించి ముస్లింలు ఈజిప్టు నుంచి వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

అయితే, ఈ ఏడాది అధికార వేడి కారణంగా ఉక్కుపోతతో యాత్రికులు ఇబ్బందిపడ్డారు. చాలా మంది ఎండలో కాలినడకన యాత్రకు రావడంతో వారి ఆరోగ్యం క్షీణించింది. వందలాది మంది క్యూ లైన్లలో నిల్చోవడం జరిగింది. ఈ కారణంగా ఉక్కుపోతలో ఊపిరి ఆడక వారంతా చనిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్‌ చేయడానికి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక, మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల (ఫారెన్‌హీట్‌) నమోదు అయినట్టు అధికారులు చెప్పారు.

 

 

మరోవైపు.. హజ్‌ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్‌ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారని వెల్లడించింది. అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియా హజ్ యాత్ర చరిత్రలో మరణాలు అసాధారణం ఏమీ కావు. కొన్ని సార్లు రెండు మిలియన్ మంది వరకు యాత్రలో పాల్గొనే సంఘటనలు ఉన్నాయి. 2015లో మీనాలో తొక్కిసలాటలో 2400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే సంవత్సరం మీనా వద్ద తొక్కిసలాటలో 111 మంది చనిపోయారు. 1990లో హజ్‌యాత్ర సందర్భంగా 1426 మంది చనిపోయారు. అయితే ఈసారి హీట్‌వేవ్‌తో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement