heat waves deaths
-
హజ్ యాత్ర మృతులపై సౌదీ అధికారిక ప్రకటన.. మరణాలు ఎన్నంటే?
ఇటీవల సౌదీ అరేబియాలో హజ్ యాత్ర సందర్భంగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. ఈ సందర్భంగా యాత్రకు వచ్చిన వారిలో 1301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో అస్వస్థతకు గురైన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు చెప్పుకొచ్చింది.కాగా, సౌదీ అరేబియా హజ్ యాత్రకు ఈ ఏడాది పలు దేశాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చారు. దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు రెండు లక్షలకుపైగా హాజరయ్యారు. పది లక్షలకు మించి ముస్లింలు ఈజిప్టు నుంచి వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ఈ ఏడాది అధికార వేడి కారణంగా ఉక్కుపోతతో యాత్రికులు ఇబ్బందిపడ్డారు. చాలా మంది ఎండలో కాలినడకన యాత్రకు రావడంతో వారి ఆరోగ్యం క్షీణించింది. వందలాది మంది క్యూ లైన్లలో నిల్చోవడం జరిగింది. ఈ కారణంగా ఉక్కుపోతలో ఊపిరి ఆడక వారంతా చనిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ చేయడానికి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక, మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల (ఫారెన్‌హీట్) నమోదు అయినట్టు అధికారులు చెప్పారు. Almost two millions of pilgrims has performed the Hajj easily and safely, with all needed services, the numbers of deaths are 1301 and 83% of them has no permit and tried to came to #Mecca through mountains with no shelter and with high temperatures #Hajj pic.twitter.com/QOt2Hytndt— Ahmmed (@Ahmeeed_839) June 24, 2024 మరోవైపు.. హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారని వెల్లడించింది. అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు పేర్కొంది.ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియా హజ్ యాత్ర చరిత్రలో మరణాలు అసాధారణం ఏమీ కావు. కొన్ని సార్లు రెండు మిలియన్ మంది వరకు యాత్రలో పాల్గొనే సంఘటనలు ఉన్నాయి. 2015లో మీనాలో తొక్కిసలాటలో 2400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే సంవత్సరం మీనా వద్ద తొక్కిసలాటలో 111 మంది చనిపోయారు. 1990లో హజ్‌యాత్ర సందర్భంగా 1426 మంది చనిపోయారు. అయితే ఈసారి హీట్‌వేవ్‌తో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. Akibat cuaca panas ekstrem di mekkah melebihi 50° , setidaknya lebih dari 550 jema'ah hajj meninggal dunia dan lebih 2.000 orang di rawat.Innalilahi wa innailaihi rooji'un.Meninggal diwaktu yang indah, ditempat yang indah dan sedang memakai pakaian terindah. pic.twitter.com/HgbcnUU8UM— Humairah (@Humairah_922) June 19, 2024 -
Delhi heatwave: ఢిల్లీలో వడగాడ్పులకు గూడు లేని 192 మంది బలి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎండల తీవ్రత, వడగాడ్పులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 11 నుంచి 19వ తేదీల మధ్య అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో వేడిగాలులకు తాళలేక 192 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 80 శాతం మంది ఎటువంటి ఆశ్రయం లేని వారేనని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఎన్జీవో తెలిపింది. ఇటువంటి వారికి తక్షణమే వసతులు కలి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ చెప్పారు. గాలి కాలుష్యం, పారిశ్రామికీకరణ,అడవుల నరికివేత వంటివి ఉష్ణోగ్రతలు పెరగడానికి, గూడు లేని వారి ఇబ్బందులను పెంచాయని విశ్లేíÙంచారు. -
ఓరి దేవుడో.. ఇవేం ఎండలు! వడదెబ్బకు 54 మంది మృతి
ఉత్తరప్రదేశ్: రాజస్థాన్‌లో బిపర్ జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంటే.. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత మూడు రోజుల్లోనే బల్లియా జిల్లా ఆస్పత్రిలో 54 మంది మృతి చెందారు. దాదాపు 400 మంది తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన రోగులకు వేరువేరు కారణాలున్నప్పటికీ ఎండ తీవ్రత ఓ కారణమని వైద్యులు చెప్పారు. రోజురోజుకూ వేడితీవ్రత ఎక్కువగా..ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య పెరిగిపోతోందని తెలిపారు. రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో ఎండలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయని వెల్లడించారు. ఆస్పత్రిలో చేరుతున్న రోగుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో సహా పలు ఆరోగ్య సమస్యలను గుర్తించినట్లు పేర్కొన్నారు. జూన్ 15న 23 మంది మరణించగా..ఆ మరుసటి రోజు 20 మంది మృతి చెందారు. కాగా.. శనివారం 11 మంది ప్రాణాలు పోయాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ఎస్కే యాదవ్ వెల్లడించారు. రోగుల ఆరోగ్య పరిస్థితికి ఏదైనా వ్యాధి కారకమా? అని తెలుసుకోవడానికి లక్నో నుంచి ఓ బృందం వస్తోందని అడినల్ హెల్త్ డైరెక్టర్ డా.బీపీ తివారీ తెలిపారు. వేడి, చలి పెరిగినప్పుడు శ్వాసకోశ సమస్యలు, డయాబెటిస్, బీపీ విపరీతంగా పెరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎండలు పెరగడమే తాజా మృతులకు కారణమని వెల్లడించారు. ఆస్పత్రికి రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో స్ట్రెచర్స్ లేమి కారణంగా రోగులను బంధువులు భుజాలపై మోసిన సందర్భాలు ఎదురయ్యాయని చెప్పారు. ఇదీ చదవండి:అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్జోయ్’.. ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ -
మహారాష్ట్రలో విషాదం.. ప్రాణాలు తీసిన అవార్డుల ఫంక్షన్
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రదానోత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖార్‌గఢ్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. తీవ్రమైన ఎండలో గంటల తరబడి కూర్చున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం.. నవీ ముంబయిలో ఆదివారం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించగా.. వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వేడుక మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగింది. మైదానం జనంతో కిక్కిరిసిపోగా.. ఈవెంట్‌ను చూసేందుకు ఆడియో, వీడియో సౌకర్యాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ, ఎండ నుంచి రక్షణ కల్పించేలా షెడ్లుగానీ, టెంట్లుగానీ వేయలేదు. ఈ క్రమంలో మండుటెండలో గంటల కొద్దీ కూర్చువడంతో సొమ్మసిల్లిపోయారు. ఇక, వీఐపీలు కూర్చునే వేదిక వరకూ మాత్రమే టెంట్లు, షెడ్లు వేశారు. దీంతో, మిగిలిన వారు వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 600 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన విషయం తెలియడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నవీ ముంబైకి చేరుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, వడదెబ్బ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ అలియాస్ అప్పాసాహెబ్ ధర్మాధికారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ తదితరులు హాజరయ్యారు. -
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : రెండు వారాలుగా వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాది అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆగ్రా నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌కు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులు ఝాన్సీ వద్ద ఉగ్ర తాపాన్ని భరించలేక మరణించారు. వడదెబ్బతోనే వీరు మరణించారని భారతీయ రైల్వే ప్రతినిధి అజిత్‌కుమార్ సింగ్ మంగళవారం వెల్లడించారు. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం బాధితులు ప్రయాణిస్తున్న రైలు ఝాన్సీకి చేరుకుంటుండగా ప్రయాణీకుల్లో ఒకరు స్పృహ కోల్పోయారని తమకు సమాచారం అందిందని, తాము వైద్య సిబ్బందితో స్టేషన్‌కు చేరుకోగా ముగ్గురు ప్రయాణీకులు అప్పటికే మరణించగా, మరో ప్రయాణీకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని చెప్పారు. కాగా, ఝాన్సీలో ఇటీవల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. తాము ఆగ్రా దాటిన వెంటనే ఎండ వేడిని భరించలేకపోయామని, కొందరికి శ్వాస సమస్యలు తలెత్తగా మరికొందరు అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశారని కొందరు ప్రయాణీకులు చెప్పారు. ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా రాజస్ధాన్‌లో రికార్డుస్ధాయిలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. -
వేడి గాలులకు 22,562 మంది మృతి
న్యూఢిల్లీ: భారత దేశం నిప్పుల కొలిమిలా తయారైంది. చండప్రచండంగా వీస్తున్న వేడి గాలులకు మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. మహారాష్ట్రలోని బీడ్‌లో యోగిత అనే 12 ఏళ్ల బాలిక పదే పదే మంచి నీళ్ల కోసం ఎండలో బిందె పట్టుకొని వెళ్లడం వల్ల గుండెపోటుతో మరణించింది. తాజాగా చోటుచేసుకున్న ఈ సంఘటన దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఏడాది ఇప్పటికే ఎండ వేడికి తాళలేక వందమందికి పైగా మత్యువాత పడ్డారు. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంగా చాలా రాష్ట్రాలు వేడి గాలుల కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను సంక్రమంగా లెక్కించడం లేదు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1992 నుంచి ఎంతో మంది మత్యువాత పడుతున్న ప్రభుత్వ నివారణ చర్యలు అంతంత మాత్రమే. నాటి నుంచి నేటి వరకు వేడి గాలులకు దేశంలో 22,562 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని విపత్తు నివారణ సంస్థ స్వయంగా అంగీకరించడం గమనార్హం. ఈ 23 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా 400లకు తగ్గకుండా మత్యువాత పడ్డారు. 1992, 1994 సంవత్సరాల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. 1995, 1998 సంవత్సరాల్లో ఈ సంఖ్యగా వెయ్యికిపైగా ఉంది. 2015 సంవత్సరంలో మాత్రం ఏకంగా 2,422 మంది మరణించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఏట భారత్‌లో ఎండ వేడి, వేడి గాలుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది, వాయువ్య భారత్, మధ్య భారత్ ప్రాంతాలతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 45 మంది మరణించారు. తెలంగాణలో 66 మంది మరణించారని ఏప్రిల్ 6వ తేదీన ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 16 మంది మాత్రమే మరణించారని సవరించిన జాబితాలో పేర్కొంది. మత్యువాతను తప్పించుకునేందుకు ఎండలోకి రావద్దని ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత సలహాలను ఇస్తోంది. రెక్కాడితేగానీ డొక్కాడని దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కూరగాయల అమ్మకందారులు, రోడ్డును ఆశ్రయించి వ్యాపారం చేసుకునే హ్యాకర్లు రోడ్డెక్కకుండా ఉండగలరా? ఇక నిలువ నీడలోని బిచ్చగాళ్లు, అనాథలు, వద్ధుల సంగతి సరేసరి. వారు నీటపట్టున విశ్రాంతి తీసుకుంటే వారికి పూట గడవదు. ఇలాంటి వారందరికి ప్రభుత్వం సమ్మర్ షెల్టర్లను ఏర్పాటుచేసి ఆహార వసతిని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.