న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎండల తీవ్రత, వడగాడ్పులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 11 నుంచి 19వ తేదీల మధ్య అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ సమయంలో వేడిగాలులకు తాళలేక 192 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 80 శాతం మంది ఎటువంటి ఆశ్రయం లేని వారేనని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనే ఎన్జీవో తెలిపింది.
ఇటువంటి వారికి తక్షణమే వసతులు కలి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ చెప్పారు. గాలి కాలుష్యం, పారిశ్రామికీకరణ,అడవుల నరికివేత వంటివి ఉష్ణోగ్రతలు పెరగడానికి, గూడు లేని వారి ఇబ్బందులను పెంచాయని విశ్లేíÙంచారు.
Comments
Please login to add a commentAdd a comment