RTC Bus And Car Collide In Prakasam District: 4 Dead, 2 Injured - Sakshi
Sakshi News home page

ప్రకాశం: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 

Published Mon, May 29 2023 7:07 AM | Last Updated on Mon, May 29 2023 10:18 AM

RTC Bus And Car Collide In Prakasam District - Sakshi

సాక్త్క్షి, త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళన­కరంగా ఉంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని హైవేపై ఆదివారం రాత్రి 10.15 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నా­యి.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయ­వాడకు చెందిన సాయి(26), పిల్లి శ్రీనివా­స్‌(23), చంద్రశేఖర్‌ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయ­పడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు. మార్గంమధ్యలో శకంర్‌ (24) మృతిచెందాడు. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్‌ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఎస్సై జీవీ సైదులు తెలిపారు.

ఇది కూడా చదవండి: కోటిపల్లి రైల్వేలైన్‌కు కదలిక


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement